మూడు నెలలుగా చుక్కనీరు కరువు.. గిరిజనుల ఆవేదన
ASR: హుకుంపేట మండలంలోని కాంగుపట్టులో మూడు నెలలుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. జల్ జీవన్ మిషన్ కింద ఏర్పాటు చేసిన కుళాయిల నుంచి చుక్క నీరు రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.