ములుకుదురులో రోడ్డు ప్రమాదం.. బస్సు ఢీకొని కారు ధ్వంసం
గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం ములుకుదురు సమీపంలో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు దెబ్బతినగా, రెండు వాహనాల్లో ఉన్న పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.