చెక్కు పంపిణీ చేసిన మంత్రి

సత్యసాయి: రొద్దం మండలం M కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు P.ఈరన్న, సంజీవప్పలు గత రెండు నెలల క్రితం బైక్ ప్రమాదంలో చనిపోయారు. వారు ఇద్దరు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ఒక్కొక్కరికి రూ.5 లక్షల ప్రమాదభీమా రాగా ఇవాళ మంత్రి సవిత చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.