అంగన్వాడీ కేంద్రాల తనిఖీ

అంగన్వాడీ కేంద్రాల తనిఖీ

WNP: అమరచింత మండలంలోని చంద్రఘడ్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో శ్రీనివాసులు మంగళవారం తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహార గురించి అంగన్వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు.