నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
KRNL: కల్లూరు అర్బన్ 20వ వార్డులోని BTR నగర్, వాసవి నగర్, టెలికాం నగర్లలో రూ. 136.46 లక్షల విలువైన డ్రెయిన్‌ల నిర్మాణ పనులకు MLA గౌరు చరితారెడ్డి ఇవాళ భూమిపూజ చేశారు. అనంతరం టెలికాం నగర్ పార్కులోని 51, 52 సచివాలయాలను తనిఖీ చేసి, ప్రజలకు అండగా నిలవాలని, అర్హులైన వారికి పథకాలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.