భారత ఆర్మీ చేతికి వందలాది సూసైడ్‌ డ్రోన్లు

భారత ఆర్మీ చేతికి వందలాది సూసైడ్‌ డ్రోన్లు

భారత ఆర్మీలో వందలాది ఆత్మాహుతి డ్రోన్లు భాగమయ్యాయి. సూరత్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీతో రక్షణశాఖ రూ.10 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కేవలం రెండు నెలల్లోనే ఆ కంపెనీ కామికేజ్ డ్రోన్లను అప్పగించింది. ఈ డ్రోన్లు గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. 2.5 కేజీల పేలుడు పదార్థాన్ని తీసుకెళ్లగలవు. 10కి.మీ దూరం ప్రయాణిస్తాయి.