ప్రభుత్వ ఉద్యోగినిగా గిరిజన బిడ్డ
ATP: జిల్లా మాకోడికి గ్రామానికి చెందిన వడిత్య సుమలత ఇటీవల వెలువడ్డ కానిస్టేబుల్ ఫలితాల్లో ఎటువంటి కోచింగ్ లేకుండా విజయం సాధించి గ్రామంలోనే మొదటి మహిళ ప్రభుత్వ ఉద్యోగినిగా నిలిచింది. ఈమె తండ్రి వడిత్య రామస్వామి నాయక్, తల్లి వడిత్య సాకమ్మ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తారు. సుమలత విజయాన్ని చూసి గ్రామ ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.