జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం నాడు పర్యటించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలను రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. జొన్న పంటకు క్వింటాకు 3371 రూపాయి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.