హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం

NDL: మహానంది మండలం గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్యాధికారి డా. వెంకటరెడ్డి ప్రారంభించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.