యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసులు
వరంగల్ నగరంలో రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. కుటుంబ కలహాలతో పట్టాలపైకి వెళ్లిన యువకుడి సమాచారం అందగానే, మిల్స్ కాలనీ బ్లూ కోర్ట్ కానిస్టేబుళ్లు వాజీబ్, బాలరాజు వెంటనే స్పందించి అతడిని సురక్షితంగా అడ్డుకున్నారు. యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.