'ఇంటర్ ప్రవేశాలు ఈ నెల 12 వరకు ఛాన్స్'

'ఇంటర్ ప్రవేశాలు ఈ నెల 12 వరకు ఛాన్స్'

WNP: జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 12 వరకు అవకాశం కల్పించినట్లు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా, ప్రైవేట్ కళాశాలల్లో రూ. 500 అపరాధ రుసుముతో ప్రవేశాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందకుండా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.