VIDEO: వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెన

BDK: అశ్వాపురం మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లడానికి గొందిగూడెం ఇసుక వాగుపై నిర్మించిన వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. బ్రిడ్జి నిర్మాణంలో ఉండగా తాత్కాలికంగా వేసిన కట్టలు సైతం కొట్టుకుపోయాయి. దీంతో గొందిగూడెం, జీ కొత్తూరు, ఎలకలగూడెం, మణుబోతుల పాడు గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.