'రోహిత్ భయ్యా తిట్టకపోతేనే మాకు అసౌకర్యం'
రోహిత్ జూనియర్ ప్లేయర్లను ప్రేమతోనే తిడతాడని, అలా తిట్టకపోతే 'ఎందుకు తిట్టట్లేదు?' అని ఎంతో అసౌకర్యంగా ఉంటుందని యశస్వీ జైస్వాల్ అన్నాడు. జట్టులో రోహిత్, కోహ్లీ ఉంటే ఎంతో ప్రేరణగా ఉంటుందని, వారు ఆటలో తమ అనుభవాలను పంచుకుంటారని తెలిపాడు. యువకులుగా వారు చేసిన తప్పులను తమకు చెప్పి అలాంటివి చేయొద్దని సూచిస్తారని పేర్కొన్నాడు. వాళ్లు జట్టులో లేకపోతే వెలితిగా ఉంటుందన్నాడు.