VIDEO: ఫంక్షన్ హాల్‌కు ఎమ్మెల్యే భూమిపూజ
NZB: రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న జనరల్ ఫంక్షన్ హాల్‌కు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామ సర్పంచ్ రాంబాబు, తహశీల్దార్ తారాబాయి, మాజీ జడ్పీటీసీ నారోజీ గంగారాం, ఏఎంసీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.