'లక్ష్య సాధనలో రాజీ లేకుండా ముందుకు సాగాలి'

'లక్ష్య సాధనలో రాజీ లేకుండా ముందుకు సాగాలి'

పల్నాడు జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ డా. కృతికా శుక్లా వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత సూచికలు (KPIs) అమలులో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపడం ప్రధాన లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.