అనన్య నాగళ్ల మూవీ నుంచి సాంగ్ రిలీజ్
ఈషా రెబ్బా, అనన్య నాగళ్ల, నందిని రాయ్, దినేశ్ తేజ్, అజయ్ కతుర్వార్, యశ్విన్ వేగేశ్నలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కథాకేళి’. నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ‘‘కొత్తగా ఓ రెండు తారలే’’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను స్టార్ సింగర్ కోయిలమ్మ చిత్ర ఆలపించారు.