VIDEO: బీజేపీలో చేరిన వైసీపీ ప్రజా ప్రతినిధులు

తూ.గో: అనపర్తి మండలం రామవరంలో అనపర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సోమ వీర్రాజు, బొమ్మల దత్తు, శివరామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.