విశేష అలంకరణలో కన్యకాపరమేశ్వరి
KFP: ప్రొద్దుటూరులో వెలసిన కన్యక పరమేశ్వరి ఆదివారం విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించగా, నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.