ఉలవలదిన్నెలో స్వస్థ నారీ-సశక్త్ పరివార్ అభియాన్
CTR: స్వస్థ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సోమవారం పుంగనూరు మండలం ఉలవలదిన్నె సమీపాన గల సచివాలయంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ముడిపాపనపల్లి PHC డాక్టర్ పవన్ కుమార్ పలువురు మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.