నేషనల్ హైవే-16పై దట్టమైన పొగమంచు
కృష్ణా: నేషనల్ హైవే-16పై దట్టమైన పొగమంచు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వర్షంలా కురుస్తున్న మంచు కారణంగా గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు దృశ్యమానత తీవ్రంగా తగ్గింది. ఉంగుటూరు, పొట్టిపాడు, తేలప్రోలు, ఆత్కూరు, పెద్ద అవుటపల్లి, పరిసర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు లైట్లు ఆన్ చేసి ప్రయాణం చేస్తున్నారు.