జిల్లా క్రీడాకారిణికి జాతీయ స్థాయిలో పతకం

NZB: జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఉషూ పోటీల్లో జిల్లాకి చెందిన ఫరియా ఖానం కాంస్య పతకాన్ని సాధించిందని జిల్లా కార్యదర్శి, కోచ్ మొహమ్మద్ ఒమర్ తెలిపారు. ఈ పోటీలు గుజరాత్ రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయంలో ఈ నెల 2 నుండి 7 వరకు నిర్వహించిన ఖేలో ఇండియా మహిళల జాతీయ ఉషు ఛాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారునికి పతకం రావడం పట్ల పలువురు అభినందించారు.