రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం నూతన బ్రిడ్జి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనగా రహదారి పక్కనే ఉన్న పంటకాల్వలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసినా అప్పటికే ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.