నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KRNL: వెల్దుర్తి సబ్ స్టేషన్‌లో త్రీఫేస్ కొత్త బ్రేకర్ మరమ్మతుల కారణంగా మండలంలో పలు గ్రామాలలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. చేరుకులపాడు, మాదాపురం, పుట్లూరు, సుధపల్లె, బింగుదొడ్డి, కసాపురం, నార్లాపురం గ్రామాలకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.