జిల్లాలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబెర్ పర్యటన
అనకాపల్లి: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం శనివారం నర్సీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆయనను ఆర్డీఓ వీవీ రమణ, పలు శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దళితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దళితులందరికీ సంపూర్ణ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు.