‘ఐరోపాకు ఇరాన్ ముప్పు.. ప్రపంచం ఏకం కావాలి’
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ఐరోపాకు ఎంతో ముప్పు ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఇప్పటికే సైప్రస్‌పై దాడి చేసిందని, యావత్ ప్రపంచాన్ని ఇరాన్ ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని అడ్డుకుంటూ ఇరాన్ ప్రపంచాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని కోరారు.