VIDEO: విరిగిపోయిన భీమవరం రైల్వే గేట్
కృష్ణా: గుడివాడలోని భీమవరం రైల్వే గేట్ నిన్న రాత్రి విరిగిపోవడంతో ఆ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. రైల్వే సిబ్బంది తక్షణమే స్పందించి, గేట్ మరమ్మత్తు పనులను అత్యవసరంగా ప్రారంభించారు.