క్రిటికల్ స్టేషన్లను సందర్శించిన ఏసీపీ
KMM: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ సోమవారం రాత్రి ఏన్కూర్ మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. సమస్యాత్మక గ్రామాలైన గార్ల ఒడ్డు, భగవాన్ నాయక్ తండ గ్రామాలలో ఆమె పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా సమన్వయం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.