పశ్చిమ ఆసియా దేశాల్లో CBSE పరీక్షలు వాయిదా
బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల్లో రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన CBSE 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. దీనికి సంబంధించి కొత్త పరీక్షా తేదీలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని బోర్డు స్పష్టం చేసింది.