'సరిపడా యూరియా అందించేలా కలెక్టర్‌లు దృష్టి సారించాలి'

KNR: సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఉదయం ఫోన్‌లో యూరియా నిలువలు, సరఫరాల గురించి ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సరిపడా యూరియా అందేలా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. మండలాల వారిగా ప్రతిరోజూ యూరియా పంపిణీపై రిపోర్ట్ అందజేయాలని, ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని పేర్కొన్నారు.