చలివేంద్రాన్ని ప్రారంభించిన సీఐ

చలివేంద్రాన్ని ప్రారంభించిన సీఐ

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సంతోష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మజ్జిగను అందజేశారు. ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పట్టణంలో ఇంకా చలివేంద్రాలు ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని సూచించారు.