చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపాలి: కలెక్టర్

చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపాలి: కలెక్టర్

ADB: చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులోని మహాత్మా జ్యోతి బాపూలే పాఠశాల, కళాశాలలో జరిగిన క్రీడా వార్షిక ముగింపు వేడుకల్లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. క్రీడల్లో రాణించడం ద్వారా స్పోర్ట్స్‌ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు.