రూ. రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

రూ. రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

MNCL: జన్నారం మండలంలోని చెరుకుగూడ గ్రామానికి చెందిన గొల్లె లక్ష్మికి యూనియన్ బ్యాంక్ అధికారులు రూ. రెండు లక్షల ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన చెక్కును అందజేశారు. లక్ష్మీ భర్త రాజ్యం బ్యాంక్ కస్టమర్‌గా ఉండి ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు బ్యాంక్ అధికారులు సురక్ష బీమా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సచిన్ పాల్గొన్నారు.