'సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి': ఎమ్మెల్యే

'సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి': ఎమ్మెల్యే

పెద్దపల్లి పురపాలక సంఘం తొలి సమావేశం ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని తెలిపారు. తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం మొదలగు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.