ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
KMM: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన దుబ్బల మధుసూదన్, కృష్ణవేణి(37) దంపతులు చైతన్యనగర్‌లో ఉంటున్నారు. సోమవారం వారి మధ్య చిన్న గొడవ జరగగా, కృష్ణవేణి వంటగదిలో ఉరేసుకుంది. గమనించిన భర్త ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.