ఆదోని మండల విభజనపై ఆందోళనలు
KRNL: ఆదోని మండల విభజనపై ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. 17 గ్రామాలతో పెద్ద హరివణం మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. మదిరె, నాగనాథహళ్లి, గణేకల్ తదితర గ్రామాల ప్రజలు పెద్దహరివరణం తమకు 30 కి.మీ దూరం వస్తుందని చెబుతున్నారు. ఆదోని నియోజకవర్గాన్ని ఆదోని రూరల్, అర్బన్, పెద్ద హరివణం, పెద్ద తుంబళం మండలాలుగా విభజించాలని అంటున్నారు.