ఘనంగా శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు
TPT: టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భగవంతుడు అందరివాడని, సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వ భావనతో జీవించాలనే సందేశాన్ని శ్రీరామానుజాచార్యులు ఇచ్చారని తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తెలిపారు. ఈ ఉత్సవాలు ఈనెల 22 వరకు జరుగనున్నాయి.