పాత దుగ్గిలో ఏనుగులు సంచారం

పాత దుగ్గిలో ఏనుగులు సంచారం

మన్యం: కొమరాడ మండలం పాతదుగ్గి పరిసరాలలో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు శనివారం అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ ఏనుగులు వద్దకు వెళ్లవద్దని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఏనుగులు పంటలు ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.