ఆర్థోడాంటిస్ట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే
NGKL: విశాఖపట్నంలోని ఒక హోటల్లో జరిగిన అఖిల భారత ఆర్థోడాంటిస్ట్ కాన్ఫరెన్స్‌కు శనివారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని ప్రముఖ ఆర్థోడాంటిస్టలతో సమావేశమైన ఆయన దంత వైద్య రంగం అభివృద్ధిపై కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థోడాంటిక్ సేవలను మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు.