'ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేద్దాం'

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈనెల 15న స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేద్దామని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కృష్ణా జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కొనకళ్ళ నారాయణరావు పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండా ఓ ఉద్వేగం, స్ఫూర్తి అని అన్నారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య మన జిల్లా వాసుడు కావడం కృష్ణా జిల్లా ప్రజల అదృష్టమన్నారు.