బి.కోడూరులో గుండెపోటుతో ఒకరు మృతి
KDP: బి. కోడూరు మండలం రెడ్డివారిపల్లికి చెందిన బోరెడ్డి రాఘవరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న బద్వేల్ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి రాఘవరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజెప్పి ధైర్యం ఇచ్చారు.