చలి తీవ్రతతో వణికిపోతున్న ప్రజలు
అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణ పరిసర ప్రాంతాలలో నేడు ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీనితో చలి తీవ్రత బాగా పెరిగింది. గ్రామాలలో ప్రజలు చలిమంటలు వేసుకుని చలికాచుకుంటున్నారు. పట్టణ ప్రాంతాలలో ఈ దృశ్యాలు అరుదుగా కనిపిస్తున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పల్లెల్లో పిల్లలు, పెద్దలు చలిమంటల వద్ద చేరి చలికాచుకోవడం సర్వసాధారణం.