14,15 వార్డులలో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

మెదక్: నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 14,15 వార్డులలో మున్సిపల్ ఛైర్మన్ అశోక్ గౌడ్ పర్యటించారు. వార్డులలో నెలకొన్న సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. వార్డులలో వేసవికాలంలో నీటి సమస్య రాకుండా ఉండడానికి మున్సిపల్ పరిధిలో నూతనంగా మూడు బోర్లు తవ్వించామన్నారు. దాంతో నీటి సమస్య లేకుండా చేశామన్నారు.