జిల్లా నుంచి ఆగిన అరటి ఎగుమతులు!
నంద్యాల: పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా జిల్లా నుంచి అరటి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో 12,000 ఎకరాల్లో అరటి సాగు చేశారు. కోత ఎగుమతులు ఆగిపోవడం, ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. ప్రభుత్వం స్పందించి అరటి ధరలకు ప్రత్యామ్నాయం కల్పించి, ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.