పేలుడు ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి

పేలుడు ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి

AP: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.