మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ

మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ

కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని హార్బర్ పేట మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆదివారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వారికి బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె తదితర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.