విమ్స్ స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
VSP: విమ్స్ స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని డైరెక్టర్ డా. కే.రాంబాబు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యానికి కీలకమని, కోవిడ్ సమయంలో దాని ప్రాముఖ్యం మరింత స్పష్టమైందన్నారు. ఆసుపత్రి ఆవరణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సిబ్బంది నృత్యం ద్వారా పరిశుభ్రత సందేశం అందించారు. ఈ కార్య్రక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.