కూలిన ట్రాన్స్‌ఫార్మర్.. తప్పిన ప్రమాదం

కూలిన ట్రాన్స్‌ఫార్మర్.. తప్పిన ప్రమాదం

NRPT: మరికల్ మండలంలోని జిన్నారం గ్రామ సమీపంలో ఇవాళ భారీ వాహనాలు వెళ్లడం వల్ల వాహనాలు విద్యుత్ వైర్లకు తాకి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ నెలకు ఒరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వాహనాల రాకపోకల వల్ల తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని జిన్నారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.