ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యకికి తీవ్రగాయాలు
JN: జనగామ పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనకనుంచి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు తక్షణం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు రిఫర్ చేశారు.