చెవిరెడ్డిని కలిసిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే
ప్రకాశం: మద్యం కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో పుల్లలచెరువు మండల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్, పుల్లల చెరువు వైసీపీ కన్వీనర్ దోమకాల. వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు కొర్లకుంట. రఘు, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు.