గుడిమెట్లలో మంచినీటి స్కీమ్‌ పునః ప్రారంభం

గుడిమెట్లలో మంచినీటి స్కీమ్‌ పునః ప్రారంభం

NTR: చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామపంచాయతీ పరిధిలో మరమ్మతులు పూర్తి అయిన మంచినీటి స్కీమ్‌ను మంగళవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లాంఛనంగా పునః ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపడుతూ.. నీటి సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు.